మోడీ చెప్పిన సప్త సూత్రాలపై అవగాహన కల్పించాలి: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

by Ajay Maddhiboyina |

దేశ ప్రధాని మోడీ దేశ ఆర్థిక భద్రత కోసం సూచించిన సప్త సూత్రాలు, సప్త పరివర్తన గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​పేర్కొన్నారు.

మోడీ చెప్పిన సప్త సూత్రాలపై అవగాహన కల్పించాలి: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
X

దేశ, తెలంగాణ బ్యూరో : దేశ ప్రధాని మోడీ దేశ ఆర్థిక భద్రత కోసం సూచించిన సప్త సూత్రాలు, సప్త పరివర్తన గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​ పేర్కొన్నారు. భారతదేశం డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్”గా ఎదగాలంటే, మన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలని, దేశ అభివృద్ధి రేటు దెబ్బతినకుండా, భవిష్యత్ ఆర్థిక సవాళ్లను ముందుగానే ఎదుర్కొనేందుకు మోడీ సప్త సూత్రాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఇది రాజకీయాల కోసం కాదు, దేశ ఆర్థిక భద్రత కోసమన్నారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశం ప్రస్తుతం భారీ ట్రేడ్ డెఫిసిట్‌ను ఎదుర్కొంటోంది.

ప్రతి సంవత్సరం సుమారు 700 బిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతుండగా, ఎగుమతులు దాదాపు 400 బిలియన్ డాలర్ల వరకు మాత్రమే ఉన్నాయి. అంటే సుమారు 300 బిలియన్ డాలర్ల అంటే 25 లక్షల కోట్ల రూపాయల ట్రేడ్ డెఫిసిట్ ఉంది. భారత కరెన్సీ విలువపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతోంది. సప్త సూత్రాల్లో ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరారు. శాశ్వతంగా కొనొద్దని కాదు, కేవలం తాత్కాలిక నియంత్రణ మాత్రమే. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం మనదేనని, ప్రతి సంవత్సరం దాదాపు 800 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది.

దీని విలువ సుమారు రూ.5.5 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇందులో 95 శాతం వ్యక్తిగత వినియోగానికే ఉపయోగపడుతోంది. దీంతో రూ.5 నుంచి 6 లక్షల కోట్ల విలువ విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. దేశంలో అధికంగా వంటనూనె వినియోగం జరుగుతోంది. ప్రతి కుటుంబం నెలకు కనీసం ఒక లీటర్ ఆయిల్ వినియోగం తగ్గించినా దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ప్రజల ఆరోగ్య ఖర్చులు కూడా తగ్గుతాయి. సప్త సూత్రాలను ప్రజలు కనీసం 25 శాతం స్థాయిలో అయినా అమలు చేస్తే దేశ ట్రేడ్ డెఫిసిట్‌ను గణనీయంగా తగ్గి రూపాయి విలువ బలపడుతుంది. భారతదేశం మరింత ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది. కాంగ్రెస్​ ప్రచారం చేస్తున్నట్లు మనం క్లిష్ట పరిస్థితులో లేమని భవిష్యత్తులో రావొద్దని ముందు చూపు కోసమే చేస్తున్నట్లు చెప్పారు.

Next Story