ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదు.. జరిగేది ఏమీ ఉండదు: మాజీ మంత్రి తలసాని

by Ajay Maddhiboyina |

నందిన‌గ‌ర్‌లోని నివాసంలో మధ్యాహ్నం 3గంటలకు కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే కేసీఆర్, సిట్ అధికారులు నందినగర్ కు చేరుకున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదు.. జరిగేది ఏమీ ఉండదు: మాజీ మంత్రి తలసాని
X

దిశ‌, వెబ్ డెస్క్: నందిన‌గ‌ర్‌లోని నివాసంలో మధ్యాహ్నం 3గంటలకు కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే కేసీఆర్, సిట్ అధికారులు నందినగర్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ నివాసానికి భారీగా తరలివస్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం వెళ్లగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కారు దిగి తలసాని కేసీఆర్ నివాసానికి నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, సీనియ‌ర్ నాయ‌కుడు అయిన త‌న‌ను దౌర్జ‌న్యంగా క‌క్ష‌పూరితంగా పోలీసులు అడ్డుకున్నార‌ని అన్నారు. ఇది ప్ర‌భుత్వానికి మంచిది కాద‌ని వ్యాఖ్యానించారు. త‌న కాలు స‌రిగా లేద‌ని చెప్పినా విన‌లేద‌ని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులే కాకుండా ప్ర‌జ‌లంతా ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా ఏకం అవుతున్నార‌ని చెప్పారు. ఎన్ని గంట‌లు విచారించినా ఆ కేసులో ఏం లేద‌ని అన్నారు. అది అధికారుల‌కు సంబంధించిన విష‌యం అని చెప్పారు. అధికారుల‌కు సంబంధించిన దానిని రాజ‌కీయ‌నాయ‌కుల‌కు రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

Next Story