- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా వృద్ధాప్య, ఇతర అనారోగ్య సమస్యలతో సతమతమవుతోన్న ఆయన శుక్రవారం హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.
1940 జూలై 10వ తేదీన ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో జన్మించారు. LLB పూర్తి చేసిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి.. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా రెండుసార్లు మద్దుకూరి నారాయణరావుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1983,1985,1989 ఎన్నికల్లోనూ ఓటమి పాలైన ఆయన.. 1991 ఉపఎన్నికల్లో, 1994 సార్వత్రిక ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. వైఎస్సార్, కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. 2016లో కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరిన వెంకటరెడ్డి.. 2020లో ఆ పార్టీకి కూడా రిజైన్ చేసి వైఎస్సార్సీపీలో చేరారు.






