- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ కగార్‌కు తాత్కాలిక బ్రేక్?.. మాజీ మావోయిస్టు రాజిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
తమది లొంగుబాటు కాదని, పోలీసులే అరెస్ట్ చేసి సరెండర్‍గా చూపారని మాజీ మావోయిస్టు నేత మల్లా రాజిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మావోయిస్టు మల్లా రాజిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము లొంగిపోయామని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా బయటకు వచ్చి పని చేద్దామని మేమంతా చర్చించుకున్నామని ఇంతలో ఎస్ఐబీ పన్నిన వలలో చిక్కుకున్నామనే సంగతి స్పష్టమైందన్నారు. పోలీసులు తొలుత మమ్మల్ని అరెస్టు చేసి ఆ తర్వాత సరెండర్‍గా చూపించారని ఇందులో మా లోపం ఏమి లేదన్నారు. తాజాగా ఓ చానల్‍తో మాట్లాడిన ఆయన.. ప్రాణ భయంతోనే లొంగిపోయామనడంలో నిజం లేదని చెప్పారు. అదే నిజం అయితే ఆపరేషన్ కగారుతో పాటు అంతకు ముందు జరిగిన అనేక ఆపరేషన్ల సమయంలో అడవుల్లోనే ఉన్నామని, అప్పుడు అనేక దాడులు కూడా జరిగాయన్నారు. విభిన్న ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం కోసమే బయటకు వచ్చామని ఇంతలో పోలీసులు అరెస్టు చేశారన్నారు. బయటకు వచ్చిన మమ్మల్నీ పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు తప్ప ప్రాణభయంతో మేము బయటకు రాలేదన్నారు.
గణపతి ఆరోగ్యం సహకరించదు:
మావోయిస్టు అగ్రనేత గణపతి ప్రస్తుతం ఉద్యమాన్ని నడిపే పరిస్థితి లేదని ఆయన ఆరోగ్యం సహకరించనందువల్లే ఉద్యమ బాధ్యతలు అప్పగించి బయటకు వెళ్లిపోయారన్నారు. రెండేళ్ల క్రితం ఆయనను కలిశామన్నారు. మావోయిస్టు ఉద్యమం బలహీనపడిపోయిందనేది స్పష్టంగా తెలుస్తోందని అయితే మిగిలి ఉన్న కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు ఇప్పటికీ ప్రజల మధ్యే తిరుగుతున్నారని వారంతా ఏదైనా ఆలోచన చేస్తే భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవచ్చు. వారికి మా సహకారం కూడా ఉంటుందన్నారు. మాతో వారు ఏకీభవిస్తారా లేదా అనేది వారి ఇష్టం అన్నారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో జరిగిన నష్టాలకు కారణం ఏంటనేది ఇంకా మిగిలి ఉన్న, లొంగిపోయిన, జైల్లో ఉన్న మావోయిస్టులతో చర్చించి ఒక నిర్ధారణకు రావాల్సి ఉందన్నారు.
ఆపరేషన్ కు తాత్కాలిక బ్రేక్ ప్రతిపాదన:
ఆ తర్వాతే సమాజంలో వచ్చిన ఏ మార్పులను పార్టీ పసిగట్టలేకపోయింది దానికి కారణం ఏమిటి అనేది నిర్ధారణకు వస్తామని ఆ నివేదికను మీడియాకు వెల్లడిస్తామన్నారు. దీనికోసం వివిధ ప్రాంతాల్లో ఉన్న మాజీ మావోయిస్టులు, అమరవీరుల కుటుంబ సభ్యులను కలిసే కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. ప్రజల కోసమే మా శేష జీవితం ఉండబోతుందనేది ప్రజలకు వివరిస్తామన్నారు. మిగిలిన మావోయిస్టులను అజ్ఞాతం నుంచి బయటకు పిలవాలని ఆపరేషన్ కగార్‍ను తాత్కాలికంగా వాయిదా వేయిస్తామని మమ్మల్ని కలిసిన ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని రాజిరెడ్డి చెప్పారు. అయితే బహిరంగ ప్రకటన చేస్తే వారిని పిలవడానికి మేము సిద్ధమే అని తాము చెప్పామన్నారు.
నో పాలిటిక్స్:
రాజకీయాల్లోకి వచ్చే ప్రస్తే లేదని రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఈ దశలో మేము ఏ రాజకీయ పార్టీలో చేరబోమని, పార్లమెంటరీ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన గత్యంతరం అయితే మాకు లేదన్నారు. ప్రజాసమస్యలపై పోరాటాలకు మా మద్దతు ఉంటుందన్నారు.






