TG Govt: గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా విడుదల

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు 66 మంది గల్ఫ్

TG Govt: గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు 66 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం శుక్రవారం రూ.3 కోట్ల 30 లక్షల ఎక్స్ గ్రేషియా(Govt Ex-Gratia)ను వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి(Anil Kumar Eravathri) ఒక ప్రకటనలో తెలిపారు.

సీఎం సూచన మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక, ప్రణాళిక) కే.రామక్రిష్ణా రావుతో సమన్వయము చేసి నిధులు విడుదల చేయించానని అనిల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 28 మంది, జగిత్యాల 19, కామారెడ్డి 9, నిర్మల్ 7, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ఒక్కొక్కరి చొప్పున 66 మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని వివరించారు. గతంలో 103 మందికి రూ.5 కోట్ల 15 లక్షలు విడుదల చేశారని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 169 మందికి రూ.8 కోట్ల 45 లక్షలు చెల్లింపు జరిగిందని అనిల్ వివరించారు.

Next Story