కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా మెరుగైన వైద్యసేవలు: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

by Ajay Maddhiboyina |

కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బుధవారం సనత్‌నగర్‌లో ఉన్న ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులు, ఫ్యాకల్టీ, రోగులతో సంభాషించారు.

కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా మెరుగైన వైద్యసేవలు: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బుధవారం సనత్‌నగర్‌లో ఉన్న ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులు, ఫ్యాకల్టీ, రోగులతో సంభాషించారు. ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల డీన్ డా.శిరీష్ కుమార్ జి. చవాన్ ఈ సందర్భంగా కళాశాల, ఆసుపత్రి పనితీరు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, విజయాలు, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థులకు అందించబడుతున్న విద్యా ప్రమాణాలు, బీమా చేయబడిన కార్మికులకు, వారి ఆధారపడిన కుటుంబాలకు అందించబడుతున్న ఆరోగ్య సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.

సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్, యోగా సేవలను కొనసాగించాలన్నారు. విద్యార్థులలో వైద్య ప్రమాణాలను మరింతగా పెంచేందుకు, విలువలను పెంపొందించేందుకు ప్రముఖ వ్యక్తుల ద్వారా అతిథి ఉపన్యాసాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అవేక్ క్రానియోటమీ అనే న్యూరోసర్జికల్ చికిత్స పొందుతున్న బాలమణి అనే పేషెంట్ ను అడిగి అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. డయాలసిస్ యూనిట్, న్యూరోసర్జరీ విభాగం, కాథ్ ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ల తదితర సేవలను పరిశీలించారు. రోగులు, వారి సహాయకులతో సంభాషించి వారికి అందుతున్న చికిత్స, సేవల గురించి విచారించారు. నాణ్యమైన విద్య, సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నందుకు ఫ్యాకల్టీ, వైద్యులను ప్రశంసించారు.

Next Story