తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గొప్పది: కేసీఆర్

by Naga Rani Yarlagadda |

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గొప్పదని మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గొప్పది: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గొప్పదని బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ అభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడి ఉందన్నారు. సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని పాటించవలసిన బాధ్యతను ప్రకృతి స్త్రీకి కేటాయించిందని వివరించారు. అనేక కష్టాలతో మానవ మనుగడను నిలబెట్టే ప్రత్యేకమైన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న ప్రతీ మహిళా త్యాగశీలేనన్నారు. ఆకాశంలో సగం తానై.. అపారమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్న మహిళా లోకానికి అన్నిరంగాల్లోనూ పురుషుడితో సమానమైన అవకాశాల్ని మరింత అందించినపుడే కుటుంబాభివృద్ధి సంపూర్ణంగా జరుగుతుందన్నారు. స్త్రీలకు సమానమైన అవకాశాలు ఇచ్చినపుడు సమాజం ఫరిడవిల్లుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా సాధికారతే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేశామని గుర్తుచేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మహిళా సాధికారతను మరింత పెంచేలా కృషి చేయాలని సూచించారు.

Next Story