బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధం.. 500 మంది కూర్చునేలా మెయిన్ స్టేజ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-26 11:57:24  IST  )

బీఆర్ఎస్(BRS) పార్టీ ఏర్పడి 25 ఏళ్లు నిండాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న ఏర్పడింది.

బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధం.. 500 మంది కూర్చునేలా మెయిన్ స్టేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) పార్టీ ఏర్పడి 25 ఏళ్లు నిండాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న ఏర్పడింది. అయితే.. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి కావడంతో వరంగల్‌(Warangal)లో భారీ సభ నిర్వహిస్తున్నారు. వేలాదిగా జనం వస్తారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే తాత్కాలిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. హన్మకొండ(Hanamkonda) జిల్లా ఎల్కతుర్తిలో 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్‌ను ఏర్పాటుచేశారు. ఇక ఎల్కతుర్తికి వచ్చే అన్ని రోడ్డు మార్గాల్లో చెత్తను, ముళ్ళచెట్లను తొలగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ప్రతి రోడ్డుకు ఇరువైపులా మొరం పోసి చదును చేశారు.

ఇక సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. కేసీఆర్‌(KCR) అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్‌ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు.

♦️ 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ ఏర్పాట్లు

♦️ 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం

♦️ 500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక

♦️ 1,059 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు

♦️ 10 లక్షల వాటర్‌ బాటిళ్లు

♦️ 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు

♦️ వివిధ రూట్లలో 6 అంబులెన్స్‌లు

♦️ పరిసరాల్లో 12 వైద్య శిబిరాలు

♦️ 1,200 తాత్కాలిక మరుగు దొడ్లు

♦️ పార్కింగ్‌ నిర్వహణకు 2,000 మంది వాలంటీర్లు

Next Story