తెలంగాణ జాగృతి ‘లీడర్’ శిక్షణకు సర్వం సిద్ధం.. హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత

by Kema Shiva Kumar |

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘లీడర్’ శిక్షణా తరగతులకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు.

తెలంగాణ జాగృతి ‘లీడర్’ శిక్షణకు సర్వం సిద్ధం.. హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘లీడర్’ శిక్షణా తరగతులకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. కొంపల్లిలో శ్రీ కన్వెన్షన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా క్లాసులు జరగనున్నాయి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavaitha0 ప్రారంభోపన్యాసంతో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా సాయంత్రం ఆమె ముగింపు ఉపన్యాసం కూడ ఇవ్వనున్నారు. గ్రామ పంచాయతీ, పార్లమెంట్ వరకు ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతలు, హక్కులపై వివిధ రంగాల్లోని నిపుణులు తరగతులకు హాజరైన వారికి అవగాహన కల్పించనున్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో పలువురు ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను ప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో పంచుకోనున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ జాగృతి వివిధ విభాగాల బాధ్యులలో ఎంపిక చేసిన ప్రతినిధులకు ఈ ‘లీడర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు నెల నుంచి ప్రతి నెలా ఉమ్మడి పది జిల్లాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

Next Story