పోలింగ్‌కు అంతా సిద్ధం.. మరికాసేపట్లో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు

by Satheesh |

రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని

పోలింగ్‌కు అంతా సిద్ధం.. మరికాసేపట్లో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు
X

దిశ,డైనమిక్ బ్యూరో: రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అధికారులు అప్పగించారు. చివరి సారిగా ఈవీఎంలకు సంబంధించిన వివరాలను, పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. ఈవీఎంలతో పాటు సిబ్బంది మరికాసేపట్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లాల కలెక్టర్లు పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలొ జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్లు వివరించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Next Story