- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు.. జూబ్లీహిల్స్ బై పోల్‍కు సర్వం సిద్ధం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‍కు అంతా రెడీ అవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‍కు (Jubilee Hills by-election) అంతా రెడీ అవుతోంది. యూసఫ్‍గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ (డీఆర్‍సీ) సెంటర్ నుంచి పోలింగ్ సిబ్బంది ఈవీఎం మిషన్లతో పాటు ఇతర పోలింగ్ మెటీరియల్‍ను తీసుకుంటున్నారు. అనంతరం సంబంధిం పోలింగ్ మెటిరియల్‍తో ఇవాళ సాయంత్రం వరకు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. కొద్ది సేపటి క్రితం ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ (EVM distribution) ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ అందించామని చెప్పారు. పోలింగ్ తర్వాదా ఈవీఎంలు తిరిగి ఇదే స్టేడియం వద్దకు తీసుకురాబోతున్న నేపథ్యంలో స్టేడియం వద్ద వెస్ట్‌జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పర్యవేక్షణలో మూడంచెల భద్రత, నిరంతర నిఘా ఏర్పాటు చేయబోతున్నారు. మరో వైపు ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్‍మెంట్‍పై ఫోకస్ పెట్టాయి. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉండేలా వార్ రూమ్ ల నుంచి తమ పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు రేపు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు






