Musi Yatra : సీఎం రేవంత్ రెడ్డి మూసీ పర్యటనకు సర్వం సిద్ధం

by Ramesh Naini |

మూసీ పరివాహక ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే.

Musi Yatra : సీఎం రేవంత్ రెడ్డి మూసీ పర్యటనకు సర్వం సిద్ధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ పరివాహక ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి Musi Yatra పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రాంత పర్యటనకు సర్వం సిద్ధం అయింది. యాదాద్రి జిల్లా పర్యటన సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి MP Kiran Kumar Chamala, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ రాజేష్ చంద్ర సభా స్థలం ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ నెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి CM Revanth తన జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబంతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వలిగొండ మండలం సంగెం గ్రామంలో మూసి వంతెన వద్ద మూసి పునర్జీవంపై రైతులతో మాట్లాడి సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులతో మాట్లాడి నేతలు, అధికారులు స్థలాన్ని పరిశీలించారు.

Next Story