- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీలో ఉన్న ఏ ఒక్కరూ అసలైన హిందువు కాదు: సామ రామ్మోహన్ రెడ్డి
బీజేపీ చేతిలో శ్రీరాముడు సైతం బాధితుడిగా మారారని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: దేశ ప్రజలకు అయోధ్య రాముడంటే ఓ నమ్మకం అని అలాంటి నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విర్శించారు. అయోధ్య రామ మందిరం హుండీలో డబ్బులు, వెండి ఇటుకలు, ఇతర బంగారు ఆభరణాలు దొంగిలించింది బీజేపీ నాయకులేనని, చివరకు రాముడి ఒంటి మీది సొమ్ములను కూడా బీజేపీ నాయకులు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అయోధ్య రామ మందిరం నిర్మించి 3 ఏళ్లు కాకముందే ఇంత దోపిడీ చేశారని సుమారు 200 కోట్ల రూపాయల మేర రాముల వారి సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. రాముల వారు ధరించే వజ్రాల హారం నుండి పాద రక్షల దాకా అన్ని దోచుకున్నారని బీజేపీ చేతిలో చివరికి రాములవారు కూడా బాధితుడు అయ్యాడన్నారు.
వారు హిందువులే కాదు:
బీజేపీలో ఉన్న ఏ ఒక్కరూ అసలైన హిందూ కాదు అంత డూప్లికేట్ హిందువులేనని సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. అయోధ్య విరాళాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ నామమాత్రంగా ముగ్గురు సభ్యులతో SIT వేసి కొంత మంది కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడి జోలికి వెళ్లినవాడు బ్రతికి కట్టింది లేదని రాబోయే రోజుల్లో బీజేపీ పరిస్థితి కూడా అదేకాబోతోందని జోస్యం చెప్పారు. శబరిమల, తిరుపతి ప్రసాదాల్లో జరిగినట్లు రాములవారి దొంగతనం కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. రాముల వారికి బీజేపీ గురించి తెలుసని అందుకే అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందన్నారు. బీజేపీ కేవలం దేవుడి పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేస్తుందని యోగి ఆదిత్య నాథ్ గో మాత గురించి మాట్లాడుతారని కానీ బీఫ్ ఎక్స్ పోర్ట్ లో దేశంలోనే యూపీ నెంబర్ 1 గా ఉందన్నారు. ఈ దొంగతనానికి పూర్తి బాధ్యత ప్రధాన మంత్రి తీసుకోవాలని డిమాండ్ చేశారు.






