- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌లో ప్రతి మహిళ గుర్తింపును చెక్ చేయాలి: హరీష్ రావు
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేయడంపై బీఆర్‌కే భవన్‌లో ప్రధాన ఎన్నికల అధికారిని మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు.

దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేయడంపై బీఆర్‌కే భవన్‌లో ప్రధాన ఎన్నికల అధికారిని మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు. ఈ సందర్భంగా ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని సీఈవో సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కోరారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్ ఐడి కార్డులను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుందని, వీడియో ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, పెద్ద మొత్తంలో ఉన్న ఓటర్ ఐడీ కార్డులకు సంబంధించిన వీడియోలను సైతం అటాచ్ చేసినట్లు తెలిపారు.
అలాగే ఈ ఉప ఎన్నికలు సజావుగా జరగాలంటే.. జూబ్లీహిల్స్ కొన్ని సెన్సిటివ్ బూత్‌లను గుర్తించి కేంద్ర బలగాలను నియమించాలని, మహిళా పోలీస్ అధికారులను, ఆశా, అంగన్వాడీ వర్కర్లను నియమించి ఓటు వేయడానికి వెళ్లే ప్రతి మహిళ గుర్తింపును చెక్ చేయాలని, మహిళా ఓటర్లను చెక్ చేయడానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి, కచ్చితంగా ప్రతి మహిళా ఓటరును గుర్తించే బూత్ లోపలికి పంపాలని రాతపూర్వకంగా ఎన్నికల అధికారికి ఇచ్చాం ఫిర్యాదు చేశామని ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో చెప్పుకొచ్చారు. రేపే పోలింగ్ జరగనున్న క్రమంలో కుప్పలు తెప్పలుగా ఓటర్ ఐడీ కార్డులు ఉన్న వీడియో వైరల్ గా మారడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






