రోడ్డుప్రమాదంలో ప్రాణాలు పోయినా.. సంతూర్ సబ్బుల కోసం ఎగబడ్డారు!

by Yella Dhawani Reddy |

'ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చుట్టకు నిప్పు దొరికిందని మరొకడు సంబరపడ్డాడట' అనే తెలుగు సామెత చాలా మందికి తెలిసిందే.

రోడ్డుప్రమాదంలో ప్రాణాలు పోయినా.. సంతూర్ సబ్బుల కోసం ఎగబడ్డారు!
X

దిశ, వెబ్ డెస్క్: 'ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చుట్టకు నిప్పు దొరికిందని మరొకడు సంబరపడ్డాడట' అనే తెలుగు సామెత చాలా మందికి తెలిసిందే. అంటే.. ఒక వ్యక్తికి అనర్థం జరిగితే, దాన్ని చూసి ఇంకొకరు తమ ప్రయోజనంగా భావించి ఆనందపడతారని అర్థం. ఈ సామెతను నిజం చేస్తూ.. మనసును కలిచివేసే అమానవీయ ఘటన మంచిర్యాల (Manchiryala) జిల్లా లక్సెట్టిపేట వద్ద చోటుచేసుకుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సిందిపోయి, మానవత్వం మరచిపోయిన కొంతమంది వ్యక్తుల ప్రవర్తన, సమాజంలోని నైతిక విలువలు ఎలా తగ్గిపోతున్నాయో గాఢంగా చూపించింది.

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల వద్ద ఉన్న జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. బుధవారం రాత్రి లక్సెట్టిపేట నుంచి రాయచూర్‌కు సంతూర్ సబ్బుల (Santoor soaps) లోడుతో వెళ్తున్న ఒక లారీని, ఎదురుగా వస్తున్న కేటీసీ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో సబ్బుల లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే, బాధితులను ఆదుకోవాల్సిన స్థానికులు కొందరు.. ఇవేమి పట్టించుకోకుండా సంతూర్ సబ్బులను పోటీ పడి మరీ దోచుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపు లారీ లోడు సగం వరకూ ఖాళీ అయిపోయింది. నైతిక విలువలు పక్కన పెట్టి సామూహికంగా చోరీకి పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకవచ్చారు. అనంతరం డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

Next Story