Mahesh Kumar Goud : ఈటల బీజేపీలో ఉన్నా మనసు బీఆర్ఎస్ మీద ఉంది: మహేష్ కుమార్ గౌడ్

by Muthe.Rajitha |

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Eetala Rajendar) పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Cheif mahesh Kumar Goud) సంచలన ఆరోపణలు చేశారు.

Mahesh Kumar Goud : ఈటల బీజేపీలో ఉన్నా మనసు బీఆర్ఎస్ మీద ఉంది: మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Eetala Rajendar) పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Cheif mahesh Kumar Goud) సంచలన ఆరోపణలు చేశారు. నేడు గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్.. ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నా మనసు మాత్రం బీఆర్ఎస్ మీదనే ఉందని విమర్శలు చేశారు. కాళేశ్వరం స్కాం(Kaleswaram Scam) నుంచి బయటపడేందుకు కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish Rao)లతో ఈటల రాజేందర్ చేతులు కలిపారని మండిపడ్డారు. ఈటలతో ఫోన్లో మాట్లాడిన హరీష్ రావు.. అనంతరం ఇద్దరూ ఆయన ఫాంహౌస్ లో కలిసి ఏం రహస్య మంతనాలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నారా.. బీఆర్ఎస్ లో ఉన్నారా అని ప్రశ్నించారు. ఆయన మనసంతా గులాబీ పార్టీ మీదనే ఉన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ గురించి కవిత ఇప్పుడు బయటపెట్టారు గానీ.. ఈ స్నేహానికి అడ్డుగా ఉన్నాడని బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారని అన్నారు. గులాబీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని తాము ఎప్పుడో చెప్పామని.. ఇపుడు పంపకాలు సాగక బయట పడ్డాయని మహేష్ కుమార్ గౌడ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Next Story