- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను లోపల ఉన్నా.. పార్టీ చూసుకుంటుంది : చిట్‌చాట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇవాళ (సోమవారం) అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏటూ కాకుండా పోయారని అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే లకు BRS లో డోర్స్ క్లోజ్ అని స్పష్టం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వాళ్లకు అవకాశం ఇస్తామని చెప్పారు. ఏ పార్టీలో ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యే లు చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. గ్రౌండ్ లో BRSకు మంచి పట్టు ఉందని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో BRSకు 80 శాతం ఫలితాలు వచ్చాయన్నారు. దీంతో కాంగ్రెస్‌కు భయం మొదలిందని, అందుకే మున్సిపల్ ఎన్నికలు పెడుతలేరని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలకు నన్ను లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను లోపల ఉన్నా.. పార్టీ చూసుకుంటుంది.. బెదిరింపులకు నేను భయపడను.. అని వ్యాఖ్యానించారు.






