Ponnam: గుండె పోటుకు గురైనా వెనక్కి తగ్గలే.. మాజీ ఎంపీ మృతిపై మంత్రి పొన్నం

by Ramesh Goud |

మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సంతాపం(Condolences) ప్రకటించారు.

Ponnam: గుండె పోటుకు గురైనా వెనక్కి తగ్గలే.. మాజీ ఎంపీ మృతిపై మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సంతాపం(Condolences) ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఉద్యమ సమయంలో జగన్నాథంతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. నాగర్ కర్నూల్(Nagar Kurnool) మాజీ ఎంపీ మందా జగన్నాథం(Former MP Mandha Jagannatham) మృతి(Died) తీవ్ర ద్రిగ్బాంతికి(Shock) గురి చేసిందని అన్నారు. 15వ లోక్ సభలో తనతో పాటు మందా జగన్నాథం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారని, ఉద్యమ సమయంలో కూడా తనతో కలిసి పని చేశారని గుర్తు చేశారు. అంతేగాక గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహానికి గురై గుండెపోటుకి గురైనా.. మందా జగన్నాథం ఉద్యమాన్ని ఆపలేదని ఆనాటి అనుభవాలను నెమరువేసుకున్నారు. ఇక మందా జగన్నాథం మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను అని చెబుడూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Next Story