- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు : ఈటల
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా మన బోనాలు నిలుస్తాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు . ఆషాఢ మాసంలో తొలి బోనం ను గోల్కొండ లోని శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఎక్స్ లో ఈ మేరకు పోస్టు చేశారు .

దిశ , హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా మన బోనాలు నిలుస్తాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు . ఆషాఢ మాసంలో తొలి బోనం ను గోల్కొండ లోని శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఎక్స్ లో ఈ మేరకు పోస్టు చేశారు. ఈ ఆషాఢ మాసంలో లో జరిగే బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించి తొలి బోనం ను అమ్మవారికి సమర్పిస్తారు.
హైదరాబాద్ లో లష్కర్ బోనాల పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి బస్తీతో ఆషాఢం, శ్రావణం రెండు మాసాల పాటు ప్రతి ఇంట్లో బోనం అమ్మవారికి సమర్పించుకుని తల్లికి పూజలు నిర్వహించి పిల్లలు, కుటుంబం, రాష్ట్రం చల్లగా ఉండేలా, పాడి పంటలతో ఏ కష్టాలు లేకుండా జీవించే భాగ్యం కలగాలని ఆనాదిగా ప్రతి సంవత్సరం బోనాల పండుగను నిర్వహించుకుంటున్నామని ఆయన అన్నారు . బోనాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానికానికి శుభాకాంక్షలు, ప్రజలంతా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించే భాగ్యం కలగాలని, జాతరను అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ సోదరులందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు .






