గ్రేటర్​ నగరంలో ప్లైఓవర్లు త్వరగా పూర్తి చేయాలి.. గడ్గరీని కోరిన ఎంపీ ఈటెల!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-16 16:32:48  IST  )

గ్రేటర్​లోని వరంగల్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్, నిజామాబాద్ హైవేలో నిర్మిస్తున్న కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్​గడ్గరీని ఎంపీ ఈటెల రాజేందర్​కోరారు.

గ్రేటర్​ నగరంలో ప్లైఓవర్లు త్వరగా పూర్తి చేయాలి.. గడ్గరీని కోరిన ఎంపీ ఈటెల!
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​లోని వరంగల్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్, నిజామాబాద్ హైవేలో నిర్మిస్తున్న కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్​గడ్గరీని ఎంపీ ఈటెల రాజేందర్​కోరారు. ఆదివారం బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్​తో కలిసి నాగపూర్​లో ఆయన నివాసంలో కలిసి సమస్యలు వివరించారు. స్థానిక అధికారులపై ఎంత ఒత్తిడి తీసుకుని వచ్చినా పనులు వేగంగా జరగడం లేదని, ఇప్పటికే వారు ఇచ్చిన గడువులు అన్నీ పూర్తి అయినట్లు చెప్పారు.

బాలానగర్ , నరసాపూర్ జాతీయ రహదారిలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో ఆ రూట్ లో కూడా ఒక ఫ్లైఓవర్ , నాగార్జునసాగర్ క్రాస్​రోడ్డునుండి అమరావతి వరకు కొత్త హైవే నిర్మాణం జరగుతుందని, ఆ రూట్ కూడా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని సాగర్ ఎక్స్ రోడ్ వైపు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి మంజూరు చేయాలని మంత్రిని కోరగా త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారని తెలిపారు. మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారని వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని మంత్రి చెప్పారని ఈటల రాజేందర్ తెలిపారు.

కోటికి పైగా ఉన్న జనాభా, వచ్చిపోయే మరో అరకోటి మంది ప్రజలతో హైదరాబాద్ విశ్వనగరం నిత్యం రద్దీగా ఉంటుంది. హైదరాబాదులో ప్రజలు ట్రాఫిక్ జాములతో అష్ట కష్టాలు పడుతున్నారు. ఆఫీసులో పని చేసే సమయం కంటే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే సమయమే ఎక్కువ ఉందంటూ ప్రజలు వాపోతున్నారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నా పనులు నత్తనడక నడవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Next Story