కనీస అవగాహన లేకుండా పాలిస్తున్నారు.. సీఎం రేవంత్ పై ఈటల ఫైర్

by Ajay Maddhiboyina |

సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌పై బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి నీచ‌మైన బాష‌ను ప‌క్క‌నపెట్టి సాగునీరు, తాగు నీరు అందించే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. సుందిళ్ళ‌, అన్నారం బ్యారేజీల‌కు 2024లోనే మ‌రమ్మ‌త్తులు చేసిన‌ట్టు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెబుతోంద‌ని అన్నారు.

కనీస అవగాహన లేకుండా పాలిస్తున్నారు.. సీఎం రేవంత్ పై ఈటల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌పై బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి నీచ‌మైన బాష‌ను ప‌క్క‌నపెట్టి సాగునీరు, తాగు నీరు అందించే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. సుందిళ్ళ‌, అన్నారం బ్యారేజీల‌కు 2024లోనే మ‌రమ్మ‌త్తులు చేసిన‌ట్టు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెబుతోంద‌ని అన్నారు. ఇది చెబుతోంద‌ని ఎన్డీఎస్ఏనే కాబ‌ట్టి వెంట‌నే సుందిళ్ల‌, అన్నారం బ్యారేజీల్లో నీళ్లు స్టోరేజీ పెట్టుకోవాల‌ని సూచించారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో పంట‌లు ఎండిపోతున్నాయ‌ని రైతాంగం ఆందోళ‌న చెందుతోంద‌ని, తాగు నీళ్లు లేక కూడా ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు.

క‌నీస అవ‌గాహ‌న లేకుండా రేవంత్ రెడ్డి పాల‌న సాగిస్తున్నార‌ని మండిప‌డ్డారు. హ‌రీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ఉన్న ఖిలాడీ క‌మిటీలో ఈట‌ల చేరారు అని రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఖిలాడీ ఈట‌ల‌నా రేవంత్ రెడ్డా అనేది తెలంగాణ స‌మాజం నిర్ణ‌యిస్తుంద‌ని అన్నారు. రేవంత్ రెడ్డి హెడ్ లైన్స్ కోసం మాట్లాడే వ్య‌క్తి అని విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డి కేవ‌లం రాజ‌కీయ‌కోణంలో మాట్లాడ‌తార‌ని, ప్ర‌జ‌ల కోణంగా మాట్లాడ‌ర‌ని అన్నారు. చిత్త‌శుద్ధి ఉంటే ఎన్ నినోపై ఇంజ‌నీర్ల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించాల‌ని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హ‌యాంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగితే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.

Next Story