- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటల వ్యాఖ్యలపై మాట్లాడేందుకు జంకుతున్న నేతలు.. బీజేపీ హైకమాండ్ ఏం చెప్పిందంటే?
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హుజూరాబాద్ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హుజూరాబాద్ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. ‘తమపై కక్ష సాధింపులకు పాల్పడితే సహించేది లేదు. దీటుగా జవాబిస్తాం’ అంటూ ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎక్కడ చూసినా దీనిపైనే డిస్కషన్ జరుగుతోంది. ఈ ఇష్యూలో చివరకు హైకమాండ్జోక్యం చేసుకోనే పరిస్థితి ఏర్పడింది. ఈటల కామెంట్స్‌పై కౌంటర్ఇచ్చేందుకు కొందరు కమలనాథులు సిద్ధం కాగా ‘ఎవరూ కౌంటర్ఇవ్వొద్దు. తొందరపాటు చర్యగా ఆయన్ను విమర్శిస్తే క్రమశిక్షణ కింద పరిగణించి చర్యలు తీసుకుంటాం’ అంటూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చాలా మంది నాయకులు ఈ విషయంలో తలదూర్చేందుకు జంకుతున్నారు.
బీసీ వర్గాలు పార్టీ విస్మరిస్తారని..
బీసీ సామాజిక వర్గంలో ఈటల రాజేందర్బలమైన నేత కావడంతో పార్టీ పెద్దలు సైతం ఆచితూచి మాట్లాడుతున్నారు. ఆయన్ను దూరం చేసుకుంటే బీసీ వర్గాలు పార్టీని విస్మరిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే రాజేందర్ సొంత పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పార్టీలో ఉన్న బీసీలే పెద్ద సంఖ్యలో ఆయన వైపు అడుగులు వేయొచ్చని అంచనా వేస్తున్నారు.
బండికి మద్దతు ఇవ్వకపోవడంపై ఆవేదన
సీనియర్‌నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పరోక్షంగా ఈటల విమర్శలు చేయడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన సమయంలోనే పార్టీకి మైలేజ్పెరిగిందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచామని నేతలు చెబుతున్నారు. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేస్తే ఎందుకు కౌంటర్ఇవ్వడం లేదని వాపోతున్నారు.






