ఇలా అయితే.. తెలంగాణలో గెలవడం కష్టమే: ఈటల సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-17 11:15:26  IST  )

ఇలా అయితే.. తెలంగాణలో గెలవడం కష్టమే: ఈటల సంచలన వ్యాఖ్యలు

ఇలా అయితే.. తెలంగాణలో గెలవడం కష్టమే: ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. తెలంగాణలో విభజన రాజకీయాలతో గెలవలేం అని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. కులం, మతం ప్రాతిపదికగా ఎక్కడా రాజకీయాలు నిలబడవు అని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టారు.. గతంలో కేసీఆర్ పనినే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారు.. ఇద్దరికీ తేడా ఏం లేదని అన్నారు. కాంగ్రెస్ గతంలో ఎక్కడ ఉపఎన్నిక జరిగినా డిపాజిట్ కోల్పోయింది.. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోవద్దు అని హితవు పలికారు.

కాగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో హిందువులే టార్గెట్‌గా బండి సంజయ్ ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. అది ఎంఐఎంకు వేసినట్లే అని చెప్పారు. ఇంకా ఘాటుగా మొలదారం లేనోడికే అంతుంటే.. మొలదారం ఉన్న మనకెంత ఉండాలి.. హిందువులంతా బీజేపీకి ఓటు వేయాలని విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే.. తాజాగా మతం ప్రాతిపదికన చేసే రాజకీయాలు నిలబడవు అని ఈటల కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మరోసారి బండి, ఈటల మధ్య వైరం ముదురుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story