- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP తెలంగాణ అధ్యక్ష పదవిపై MP ఈటల స్పందన
మూసీ(Musi) పునరుజ్జీవనం ప్రాజెక్టుపై బీజేపీ(BJP) నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మూసీ(Musi) పునరుజ్జీవనం ప్రాజెక్టుపై బీజేపీ(BJP) నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మూసీలో విషపునీరు కలవకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. మూసీ పేరిట పేదలను రోడ్డునపడేయటం కరెక్టు కాదని అన్నారు. కూల్చివేతల సమయంలో ఇళ్లకు రెడ్ మార్కింగ్ చేసి వెళ్లిపోతే ఆ ప్రజలు అల్లాడిపోయారని గుర్తుచేశారు. పేదల స్థలాలు కూల్చివేసి మేడలు, మల్టీప్లెక్సులు కట్టడం ఎందుకని ప్రశ్నించారు. మూసీ పరిధిలో ఉండాలని సీఎం రేవంత్(CM Revanth Reddy) నన్ను అడగటం ఏంటని అన్నారు. 10 గంటల పాటు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నానని చెప్పారు.
కాంగ్రెస్(Congress) పార్టీలోనూ తనకు మంచి దోస్తులు ఉన్నారని ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియక కాంగ్రెస్ నేతలే తలలు పట్టుకుంటున్నారని అన్నారు. సీఎంగా పనిచేసే అవకాశాన్ని రేవంత్ రెడ్డి పాడు చేసుకుంటున్నాడని అన్నారు. తనకు రాజకీయాలు చేయడం చేతకాదని.. ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుందో అదే చేస్తానని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై తనకు సమాచారం లేదని తెలిపారు. రాజకీయ నేతగా నేను ఏ పార్టీలో అయినా రాణించగలను అని అన్నారు. లెఫ్ట్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టే పదవి దక్కట్లేదని అనుకోవట్లేదని చెప్పారు. అసలు లెఫ్ట్ లేదు.. రైట్ లేదు.. దేశ ప్రజల ప్రజల ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమని అన్నారు. మల్కాజిగిరి ప్రజలను ఎన్నటికీ మర్చిపోను అని అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి కొద్దిలో అధికారం మిస్సయ్యిందని అన్నారు. ఫలితాల తర్వాత తాము మదనపడ్డామని చెప్పారు.






