‘నాన్ లోకల్ అంటూ ట్రోల్స్’.. స్పందించిన MP ఈటల

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) నేపథ్యంలో ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) నేతృత్వంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో ‘మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం’ నిర్వహించారు.

‘నాన్ లోకల్ అంటూ ట్రోల్స్’.. స్పందించిన MP ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) నేపథ్యంలో ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) నేతృత్వంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో ‘మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడికి గెలవడమే అంతిమ గీటురాయి అని అన్నారు. సుపరిపాలన, ప్రజలు మెచ్చే పాలన అందించడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. మన పరివార క్షేత్రాలు అనేక సమస్యల మీద కొట్లాడుతాయి.. కానీ వాటిని పరిష్కరించే సత్తా అధికారంలోకి వస్తేనే ఉంటుందని నొక్కి చెప్పారు. అనేక సంవత్సరాల స్వప్నం 370 ఆర్టికల్ రద్దు కేంద్రంలో ప్రభుత్వం ఉండటంవల్లనే సాధ్యమైంది. రామాలయం కోసం అనేకమంది ప్రాణ త్యాగాలు చేశారు.. వేలమంది జైళ్లో మగ్గారు.. చివరికి అది కూడా బీజేపీ ప్రభుత్వమే సంపూర్నం చేసింది. అధికారం రాకపోతే.. మనం గెలిచిన వారి ఇంటి ముందు కాపలాకాయాల్సిందే. మస్కా కొట్టి పని చేయించుకునే పరిస్థితి పోవాలంటే మనం గెలవాలి. దుర్మార్గన్ని ఆపగలిగే శక్తి అధికారానికే ఉంటుందని ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

25 ఏళ్లలో ఎక్కడా ఓడిపోలేదు..

‘నేను ఎంపీగా గెలిచానంటే అది మీ అందరి అండతోనే. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఎంపీపీ కానీ.. ఒక్క జెడ్పీటీసీని కానీ.. ఒక మున్సిపల్ చైర్మన్ కానీ.. నీటి సంఘాల చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు ఏదీ ఓడిపోలేదు. వయసు, రాజకీయ జీవితం చిన్నదే అయినా.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా కొట్లాడాను.. ఒక 40 ఎలక్షన్స్‌కు ఇంచార్జిగా పనిచేశాను’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేను నాల్ లోకల్ కాదు..

గెలవాలంటే మొట్టమొదటిగా మంచి అభ్యర్థిని ఎంపిక చేయండి. సామాజికవర్గాల సమీకరణ మర్చిపోవద్దు. వాతావరణ కల్పన జరగాలి. ఎదుటివారికి చెమటలు పట్టించాలి. గట్టి లీడర్లను పార్టీలో చేర్చుకోవాలి. పార్టీలో చేరిన లీడర్లను గౌరవించండి.. అక్కున చేర్చుకోండిజజ కాకులు గద్దల లెక్క పొడవకండి. రాజకీయాల్లో విశాల హృదయంతో ఉండాలి, గొప్పగా ఆలోచించాలి. స్థానికంగా గ్రూపులు మంచివి కావు. మల్కాజిగిరి పార్లమెంట్‌లో 1992 నుండి ఉంటున్నాను. నన్ను నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకోవద్దు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అందరూ విజయం సాధించేలా ప్రణాళికలు ఉండాలని ఈటల రాజేందర్ దిశానిర్దేశం చేశారు.

Next Story