- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్లమెంట్‌లో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై ప్రస్థావన.. ఈటల ఏం మాట్లాడారంటే..?
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ఎంపీ ఈటల రాజేందర్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రస్తావించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ఎంపీ ఈటల రాజేందర్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రస్తావించారు.‘ 40 లక్షల ఓటర్లతో 70 లక్షల జనాభా కలిగిన మల్కాజిగిరి పార్లమెంట్ లోని జవహర్ నగర్ లో 40 ఏండ్ల కిందట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఒకటి రెండు చెత్త వాహనాలు వచ్చి చెత్త వేసేవి కానీ ఇవాళ 10 వేల టన్నుల చెత్తను ఒకే చోట వేస్తున్నారు. 30 కిలోమీటర్ల చుట్టూ అక్కడ నివసిస్తున్న లక్షల మంది ప్రజలు డంపింగ్ యార్డ్ నుండి వచ్చే దుర్వాసన, కీటకాల వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఒకే చోట ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఉండొద్దని 1.5 కోట్ల జనాభా ఉన్నా హైదరాబాద్ నగరంలో నాలుగు మూలల డంపిగ్ యార్డులు ఏర్పాటు చేయాలని 2017 నుండి చాలాసార్లు చెన్నైలో ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. అయినా ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారం చూపలేదు’ అని పేర్కొన్నారు. పర్యావరణ శాఖ మంత్రి ఈ సమస్యను వారి దృష్టిలో పెట్టుకొని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును త్వరగా అమలు చేసి మా జవహర్ నగర్, చుట్టూ ప్రాంతాల ప్రజలను ఈ సమస్య నుంచి దూరం చేయాలని ఎంపీ ఈటల విజ్ఞప్తి చేశారు. వీడియో ఇదే..






