రంగన్న చనిపోవడం చాలా బాధాకరం.. MP ఈటల సంతాపం

by Gantepaka Srikanth |

తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గుండెపోటుతో ఇవాళ మధ్యాహ్నం మృతి చెందారు.

రంగన్న చనిపోవడం చాలా బాధాకరం.. MP ఈటల సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గుండెపోటుతో ఇవాళ మధ్యాహ్నం మృతి చెందారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా చేసిన రంగారెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కిరణ్‌ కుమార్‌రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత మాగం రంగారెడ్డి కూడా అదే పార్టీలో చేరారు. తాజాగా మాగం రంగారెడ్డి మృతిపట్ల ఎంపీ ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు. రంగారెడ్డి మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాగం రంగారెడ్డి అంతాయపల్లి వాసులు. చిన్నప్పటినుండి విద్యార్థి నాయకులుగా పనిచేశారు. పేదల సమస్యలను తీర్చాలనే తపన ఉన్నవారు ఆయన. ఏ పార్టీలో ఉన్నా ఢిల్లీ పెద్దలతో సంబంధాలున్నవారు. దేశానికి బీజేపీనే రక్ష అని ఈ మధ్యనే బీజేపీలో చేరారు. నిత్యం ప్రజల సమస్యలు తీర్చాలంటే ఆరాటం ఉన్న రంగన్న చనిపోవడం చాలా బాధాకరం అని ఈటల రాజేందర్ ఆవేదన వ్యాఖ్యలు చేశారు. గురువారం శామీర్ పేటలో రంగారెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

Next Story