- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eetala Rajendar : కొత్త పార్టీనా.. అంత సీన్ లేదు : ఈటల రాజేందర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) నేడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) నేడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీని బీజేపీ(BJP)తో కలపాలని చూస్తున్నారని.. ఆది తనకు ఏమాత్రం ఇష్టం లేదని కవిత రాజకీయ బాంబ్ పేల్చారు. తాను ఉంటే కుదరదని, తనను పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కవిత.. పార్టీలో కేసీఆర్(KCR) నాయకత్వం తప్పా ఎవ్వరి నాయకత్వం తాను ఒప్పుకోబోనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
అయితే ఈ వ్యవహరంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eetala Rajendar) స్పందించారు. తెలంగాణలో కొత్త పార్టీ ఎవరూ పెట్టరని స్పష్టం చేశారు. ఇలాంటి గాలి వార్తలకు నేను స్పందించను అని.. స్పష్టంగా తెలిస్తే మాత్రమే మాట్లాడగలను అన్నారు. తాను ప్రజలకు జిమేదార్ ఉన్న రాజకీయ నాయకుడిని.. వాస్తవం ఉంటే మాట్లాడతా, లేకుండా మాట్లాడనని తెలియ జేశారు. బీజేపీ స్టేట్ ఫైట్ చేస్తుంది గాని స్ట్రీట్ ఫైట్స్ చేయదు అన్నారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్(KCR) ను నమ్మి ప్రజలు 10 ఏళ్లు మోసపోయారని, కాంగ్రెస్ ను నమ్మి మళ్ళీ మోసపోయారని.. అభివృద్ధి లేక తెలంగాణ ఆగం అవుతోందన్నారు.
తెలంగాణ వాదులను కలవడం కవిత తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేయడం కేసీఆర్ మొదలు పెడితే దానిని రేవంత్(Revanth Reddy0 కొనసాగిస్తున్నాడాని మండిపడ్డారు. బాధ్యయుతమైన ఎంపీగా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు అవుతాననని ఈటల వెల్లడించారు.






