- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, జగిత్యాల ప్రతినిధి, వెల్గటూర్: రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం రాత్రి ధర్మపురి కి చేరుకున్న మంత్రి ఆదివారం ఉదయం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం నేరుగా జగిత్యాలకు చేరుకున్న మంత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. సమావేశం తర్వాత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన దామోదర రాజనర్సింహ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రివ్యూ మీటింగ్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీల భర్తీ తో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఎంసిహెచ్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాలల సమస్యలతో పాటు ఇన్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర అంశాలపై చర్చించిన్నట్లు మీడియా కు వివరించారు.
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం, నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలా సంఖ్య పెంచాలని సిబ్బంది కి సూచించిన మంత్రి డయాలసిస్ పెషేంట్స్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. జాతీయ రహదారుల వెంట ప్రతి 35 కిలోమీటర్ల పరిధిలో ఒక ట్రామా కేర్ అవసరం ఉందన్న మంత్రి జగిత్యాల లో త్వరలోనే ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అదేవిధంగా ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొద్ధి నెలల క్రితం జగిత్యాల వైద్య విధాన పరిషత్ లో నిధుల విషయంలో జరిగిన అవకతవకలపై ఎంక్వయిరీ చేపడతామని స్పష్టం చేశారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇండియన్ ఆర్మీకి పూర్తి మద్దతుగా ఉంటుందని ప్రకటించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తోపాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






