తెలంగాణలో ఈగల్‌ వ్యవస్థ.. లోగో ఆవిష్కరించిన CM రేవంత్‌

by Gantepaka Srikanth |

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ(Eagle System)ను ఏర్పాటు చేసింది.

తెలంగాణలో ఈగల్‌ వ్యవస్థ.. లోగో ఆవిష్కరించిన CM రేవంత్‌
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ(Eagle System)ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో ఈగల్ వ్యవస్థ లోగోను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ యువతకు ప్రత్యేక స్థానం ఉంది. దేని మీద అయినా పోరాటం మొదలు పెడితే.. సాధించేవరకూ తెలంగాణ యువత నిద్రపోదు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఇందుకు నిదర్శనం. అలాంటి తెలంగాణ యువత డ్రగ్స్‌కు బాసిన అవడం బాధాకరం. ఇక నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మినా.. కొనుగోలు చేసినా కఠినంగా శిక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇకపై నార్కొటిక్‌ బ్యూరోను.. ఈగల్‌గా పిలుస్తాం.. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్‌ పట్టుకుంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

అంతకుముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మాట్లాడారు. రైజింగ్ తెలంగాణ స్ఫూర్తినిస్తోందని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు బాగున్నాయని కొనియాడారు. ప్రభుత్వానికి మా తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని రామ్‌ చరణ్ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) మాట్లాడుతూ.. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే వార్‌ అవసరం లేదు. యువతకు డ్రగ్స్‌ అలవాటు అయితే చేస్తే చాలు. ఆ దేశం నాశనం అయినట్లే. డ్రగ్స్ అలవాటు చేసే వారికి దూరంగా ఉండండి. డ్రగ్స్ జీవితాల్ని నాశనం చేస్తాయని విజయ్‌ దేవరకొండ పిలుపునిచ్చారు.

Next Story