- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఓటర్ లిస్టుల్లో తప్పిదాలు: మర్రి శశిధర్ రెడ్డి
రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఓటర్ లిస్టులను వార్డుల వారీగా పరిశీస్తే అనేక ప్రాంతాల్లో ఓటర్ల నమోదు విషయంలో తీవ్రమైన అసమానతలు కనిపించాయని బీజేపీ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ మర్రి శశిదర్రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఓటర్ లిస్టులను వార్డుల వారీగా పరిశీస్తే అనేక ప్రాంతాల్లో ఓటర్ల నమోదు విషయంలో తీవ్రమైన అసమానతలు కనిపించాయని బీజేపీ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ మర్రి శశిదర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా మెమోరాండం సమర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొంతమంది ఓటర్లు దేవరకొండ మున్సిపాలిటీ ఓటర్ లిస్టుల్లో నమోదు అయినట్లు, అలాగే మున్సిపాలిటీ పరిధిలోకి రాని కొన్ని గ్రామపంచాయతీలకు చెందిన ఓటర్లు కూడా మున్సిపల్ ఓటర్ లిస్టుల్లో కనిపించాయి. దేవరకొండ నుంచి సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టిముక్కుల గ్రామానికి చెందిన ఓటర్లు దేవరకొండ మున్సిపాలిటీ ఓటర్ లిస్టుల్లో నమోదు అయినట్లు డ్రాఫ్ట్ లిస్టుల పరిశీలనలో గుర్తించామన్నారు.
ఓటర్ లిస్టుల్లో చేర్పులు-తొలగింపులు
మున్సిపల్ ఎన్నికల కోసం సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో తయారైన ఓటర్ లిస్టును ఆధారంగా తీసుకుని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రక్రియలు కొనసాగుతాయి. గతంలో కూడా కిందిస్థాయిలో ఓటర్ లిస్టుల్లో చేర్పులు-తొలగింపుల నేపథ్యంలో తప్పిదాలు జరిగాయి. ఆ సందర్భాల్లో వాటిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ నేపథ్యంలో, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల్లో చోటుచేసుకున్న ఈ వ్యత్యాసాలపై పూర్తి స్థాయి ఎంక్వైరీ జరపాలని, బాధ్యత వహించాల్సిన అధికారులెవరైనా ఉంటే, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వార్డు వారీగా, మున్సిపాలిటీ వారీగా ఓటర్ లిస్టులను సరిచేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను కోరారు.తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విడుదలైన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల్లో కనిపిస్తున్న ఈ వ్యత్యాసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ స్థాయిలో లోపాలు చోటుచేసుకున్నాయన్న దానిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ జరపాలని, అలాగే బాధ్యత వహించాల్సిన అధికారులు ఎవరైనా ఉంటే, వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్. గౌతం రావు , పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ , బీజేపీ సీనియర్ నాయకులు డా. ఎస్. ప్రకాష్ రెడ్డి , బిజెపి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ మెంబర్ ఆంటోనీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






