- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టు వెబ్ సైట్‌లో ఎర్రర్స్.. హ్యాక్ తరవాత కొనసాగుతున్న సమస్యలు
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టు వెబ్ సైట్‌లో తరచూ సాంకేతిక సమస్యలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయిందంటూ హై కోర్టు రిజిస్ట్రార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టు వెబ్ సైట్‌లో తరచూ సాంకేతిక సమస్యలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయిందంటూ హై కోర్టు రిజిస్ట్రార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న క్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ మొదటి వారంలో హై కోర్టు వెబ్ సర్వర్‌ను మెయింటనెన్స్ జరిగినట్లు వెబ్ సైట్ పోర్టల్‌లో పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి హై కోర్టు వెబ్ సర్వర్‌లో తరచూ ఎర్రర్స్ వస్తున్నాయి. వెబ్ సైట్‌లో నోటీస్ బోర్డ్ పోర్టల్ కూడా గత ఆక్టోబర్ 24వ తేదీ నుంచి ఎలాంటి సమాచారం పొందుపరచలేదు.
జస్టిస్ ఎవరైనా లీవ్ ఉన్న సమచారం, పదవీ విరమణ, ఇతర సమాచారాలు నోటీస్ బొర్డ్ లో పేర్కొనేవారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి పిటిషన్ సోమవారం విచారణ ఉంది. ఛీఫ్ జస్టిస్ నేతృత్వంలోని మొదటి కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఛీఫ్ జస్టిస్ రెండు రోజుల పాటు సెలవులలో ఉన్నారు. ఈ సమాచారం కూడా హై కొర్టు వెబ్ సైట్ నోటీస్ బొర్డ్ లో పేర్కొనలేదు. వెబ్ సైట్ హ్యక్ వల్ల తరచూ సాంకేతిక సమస్యలు రావడంతో అడ్వకేట్లు, పిటిషన్ దారులు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుపుతున్నారు. కోర్టు విచారణ ఆన్ లైన్ స్ట్రీమింగ్‌లో మాత్రం ఎటువంటి అంతరాయం ఏర్పడలేదు. వెబ్ సెట్‌లో ఎందుకు ఇలా జరుతుందో దృష్టి సారించాలని హై కోర్టు అడ్వకేట్స్ కోరుతున్నారు.






