- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటన.. డైట్ కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిపై కేసు నమోదు
ఎర్రగడ్డ (Erragadda) మానసిన ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎర్రగడ్డ (Erragadda) మానసిన ఆరోగ్య కేంద్రంలో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కలుషిత ఆహారం తినడం వల్ల ఇప్పటికే ఒక రోగి మృతి చెందగా.. సుమారు 92 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. ఘటనకు కారణమైన ఉన్నతాధికారులతో పాటు డైట్ కాంట్రాక్టును పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) ప్రకటించారు.
అదేవిధంగా విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఆర్ఎంవో డాక్టర్ డి.పద్మజ (Padmaja)ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం ఆమె స్థానంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ బి.శంకర్ (Shankar)కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, డైట్ కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డి (Jaipal Reddy)పై పంజాగుట్ట (Panjagutta) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి రోగులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు.






