ఎన్నికలు ఎప్పుడు వచ్చినా BRSకు 100 సీట్లు...మాజీ మంత్రి కామెంట్స్ !

by velandi.Saikiran |

తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా BRSకు 100 సీట్లు...మాజీ మంత్రి కామెంట్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా... గులాబీ పార్టీ ( BRS Party) 100 సీట్లు గెలుచుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. తాజాగా వరంగల్ లో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.

ప్రస్తుత కాంగ్రెస్ ( Congress) ప్రభుత్వం పైన జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతతో... గులాబీ పార్టీకి మేలు జరుగుతుందని వివరించారు. అందుకే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా గులాబీ పార్టీకి... 100 సీట్లు రావడం గ్యారెంటీ అన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు.

రెండు నెలల పాటు అన్ని పనులు పక్కన పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలు, నేతలకు దిశా నిర్దేశం చేశారు. గులాబీ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించాలని సూచనలు చేశారు. అప్పుడే గులాబీ పార్టీ మరింత వేగంగా జనాల్లోకి వెళుతుందని వెల్లడించారు. కెసిఆర్ ( KCR)... ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. కాగా.. దాదాపు 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న దయాకర్ రావు... యంగ్ లీడర్ యశస్విని రెడ్డి పై ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Next Story