- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Errabelli: సీఎం రేవంత్ ప్రభుత్వం కూలడం పక్కా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని గద్దె దించేందుకు చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీలో 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని కామెంట్ చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తోందని ఆరోపించారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని.. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని బాంబు పేల్చారు. పథకాల పేర్లు మార్చి ఎంతో అభివృద్ధి చేసినట్లుగా కాంగ్రెస్ (Congress) నేతలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు సమన్వయం కొరవడిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు.






