- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Miss World 2025 : మిస్ వరల్డ్ పోటీలకు ఎంట్రీ పాసులు
హైదరాబాద్(Hyderabad) నగరం 72వ మిస్ వరల్డ్-2025(Miss World 2025) పోటీల కు ఆతిథ్యం ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరం 72వ మిస్ వరల్డ్-2025(Miss World 2025) పోటీల కు ఆతిథ్యం ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీలు జరగనున్నాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 దేశాలకు చెందిన సుందరీమణులు తరలిరానున్నారు. పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన కాంప్లిమెంటరీ ఎంట్రీ పాసులను(Entry Passes) అందించనున్నట్టు తెలంగాణ పర్యాటక శాఖ(Telangana Tourism) పేర్కొంది. ఈ పోటీలను చూసేందుకు ఆసక్తి ఉన్నవారు టూరిజం శాఖ అధికారిక వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఎంపిక చేసిన వారికి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని అధికారులు తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు https://tourism.telangana.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.






