Telangana Entrance Exams: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

by Y. Venkata Narasimha Reddy |

తెలంగాణ(Telangana) ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షల(Entrance Exams)కు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్(Exam Schedule Released)చేసింది.

Telangana Entrance Exams: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షల(Entrance Exams)కు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్(Exam Schedule Released)చేసింది. ఇంజినీరింగ్‌ లేదా అగ్రికల్చర్‌, ఫార్మసీతో పాటు పీజీ ఈసెట్‌, టీజీ ఐసెట్‌ల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. రాష్ట్ర ఉన్నత మండలి(Telangana Council of Higher Education)మొత్తం మూడు సెట్‌ల షెడ్యూల్స్‌కు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 20వ తేదీన టీజీ ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్‌ 4వరకు ఉంటుంది. ఇంజినీరింగ్‌ విభాగంలో మే 2 నుంచి 5వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. అగ్రికల్చర్‌, ఫార్మా విభాగాలకు ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. పీజీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్ మార్చి 12వ తేదీన జారీ కానుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు మార్చి 17 నుంచి మే 19వ తేదీ వరకు కొనసాగుతాయి. జూన్‌ 16 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

టీజీ ఐసెట్‌ నోటిఫికేషన్‌ మార్చి 6వ తేదీన జారీ కానుంది. మార్చి 10 నుంచి మే 3వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తుల రుసుం జనరల్‌ కేటగిరీ రూ.750, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.550 గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ పరీక్షలు రెండు సెషన్లలో జూన్‌ 8, 9 తేదీల్లో జరగనున్నాయి. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌ జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంట్రెన్స్‌ టెస్టుల అనంతరం విడుదలయ్యే ఆన్సర్‌ కీపై చాలెంజ్‌ చేస్తే ఒక్కో ప్రశ్నకు రూ. 500 చొప్పున ఫీజుగా వసూలు చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ఆల్‌ ఇండియా లెవెల్‌లో నిర్వహించే జేఈఈ, నీట్‌ వంటి పరీక్షల్లో ఆన్సర్‌ కీ చాలెంజ్‌కు ఒక్కో ప్రశ్నకు కేవలం రూ. 200 మాత్రమే వసూలు చేస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆన్సర్ కీపై ఒక్కో ప్రశ్నకు రూ. 500 వసూలు చేసేందుకు ఉన్నత విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఈ నిర్ణయంపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది.

Next Story