- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: దేశాభివృద్ధికి ఇంజనీర్లే బలమైన పునాది: సీఎం రేవంత్ ఇంజనీర్స్ డే విషెస్
తమ మేధో శక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజనీర్ల దేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తమ మేధో శక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత (Engineers) ఇంజనీర్ల దేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజనీర్లు అందరికీ ముఖ్యమంత్రి ఇంజనీర్స్ డే (Engineers' Day) సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినమైన సెప్టెంబర్ 15 ను పురస్కరించుకొని, ఆయన జ్ఞాపకార్థం ఇంజనీర్స్ డే గా జరుపుకోవడం జరుగుతుందన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరుగా, దార్శనికుడిగా, విద్యాప్రదాతగా, నిపుణుడిగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా ప్రత్యేకతను చాటారని తెలిపారు.
అత్యుత్తమ ఇంజనీరింగ్ సాంకేతికతతో వివిధ రంగాలలో ఆయన చేసిన కృషి భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి ఆదర్శంగా నిలిచాయని సీఎం చెప్పారు. మూసీ వరదల నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించేందుకు జల నియంత్రణ ప్రణాళికలు, ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టడంలో ప్రత్యేక చొరవ చూపించారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర,ఇంజనీరింగ్ విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు అందరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్స్ తమ వంతు పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.






