- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేములవాడ లడ్డూ ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆరా
వేములవాడ లడ్డూ(Vemulawada Laddu) ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఆరా తీశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వేములవాడ లడ్డూ(Vemulawada Laddu) ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన సమగ్ర విషయాలు అందజేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
లడ్డూపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు లేఖ రాసినట్టు ఆలయ ఆలయ ఈఓ రమాదేవి స్పష్టం చేశారు. ఎక్కడా ఎటువంటి లోపం జరగలేదని వెల్లడించారు. అయినా, భక్తుల మనోభావాలను గౌరవించే ప్రక్రియలో భాగంగా కీలక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీంతో ఎటువంటి తప్పిదాలు జరగొద్దని.. జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండా సురేఖ కీలక సూచనలు చేశారు. ఆలయ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారాల్లో తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story






