- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు..
మండల పరిధి బేతవోలులో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి.

దిశ, చిలుకూరు: మండల పరిధి బేతవోలులో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ప్రథమ బహుమతి గుంటూరు జిల్లా రాజుపాలెంకు చెందిన కటికం వెంకటేశ్వర్లు ఎద్దులు, ద్వితీయ బహుమతి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన పమిడి అంజయ్య చౌదరి ఎద్దులు, తృతీయ బహుమతి హుజూర్ నగర్ కు చెందిన ఏఎస్పీ సుంకి సురేందర్ రెడ్డి ఎద్దులు, నాలుగో బహుమతి పల్నాడు జిల్లా అమరావతికి చెందిన బండ్ల సాయి శ్రీభవనకు చెందిన ఎద్దులు దక్కించుకున్నాయి.
విజేతలకు బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ మాజీ కన్వీనర్ కన్మంతరెడ్డి శశిధర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య, జడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, బేతవోలు సర్పంచ్ వట్టికూటి చంద్రకళ నాగయ్య, ఎంపీటీసీలు వట్టికూటి ధనమూర్తి, నెమ్మాది సైదాబాబు తదితరులు పాల్గొన్నారు.






