- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. భద్రతా బలగాల ట్రాప్‌లో ఏడుగురు ఉగ్రవాదులు
by Kema Shiva Kumar |
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో మరోసారి కాల్పుల మోతతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో మరోసారి కాల్పుల మోతతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉధంపూర్ (Udhampur) ప్రాంతంలోని సుయోజ్ ధర్, కిష్ట్వార్ (Kishtwar) ప్రాంతంలో ఉగ్రవాదులు కదలికలు ఉన్నాయంటూ భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో భారత సైన్యం, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), జమ్ము కాశ్మీర్ పోలీసులు శుక్రవారం రాత్రి 8 గంటలల జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే, ఆయా ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న క్రమంలో సుయోజ్‌ధర్, కిష్ట్వార్ ప్రాంతాల్లో ఏడుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పలు జరిపారు. ప్రస్తతం స్పాట్‌లో కాల్పులు కొనసాగుతుండగా.. భద్రతా బలగాల ట్రాప్‌లో ఏడుగురు ఉగ్రవాదులు చిక్కినట్లుగా తెలుస్తోంది. అయితే, ఉధంపూర్‌లో ఉన్న నలుగురిని జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థలకు చెందినవారిగా అనుమానిస్తున్నారు.
Next Story






