విద్యార్థుల ప్రతిభ వెలికితీసే వేదికగా ఈఎంఆర్ఎస్ రాష్ట్రస్థాయి క్రీడలు

by Elthuri vijay kumar |

రాష్ట్రవ్యాప్తంగా 23 ఏకలవ్య పాఠశాలల విద్యార్థులతో స్పోర్ట్స్ మీట్

విద్యార్థుల ప్రతిభ వెలికితీసే వేదికగా ఈఎంఆర్ఎస్ రాష్ట్రస్థాయి క్రీడలు

- ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ సీతలక్ష్మి

- రాష్ట్రవ్యాప్తంగా 23 ఏకలవ్య పాఠశాలల విద్యార్థులతో స్పోర్ట్స్ మీట్

దిశ, కొత్తగూడ : విద్యార్థుల ప్రతిభ వెలికితీసే వేదికగా ఈఎంఆర్ఎస్ రాష్ట్రస్థాయి క్రీడలు నిలుస్తున్నాయని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ సీతాలక్ష్మి అన్నారు. గురువారం కొత్తగూడ మండలంలోని పోగులపల్లి గ్రామంలోని రాష్ట్రవ్యాప్తంగా 23 ఎకలవ్య పాఠశాలల విద్యార్థులతో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ను ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ సీతాలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా సీతలక్ష్మి మాట్లాడుతూ....గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి, విద్యా ప్రోత్సాహానికి, ప్రతిభ వికాసానికి ఈ క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని విద్యార్థులు దృఢ సంకల్పంతో ఉండాలి విద్యార్ధి దశ నుండే క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని.విద్యతో పాటు క్రీడలు కూడా అంతే ముఖ్యం అంటూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, సరైన మార్గంలో దింపేందుకు గిరిజన శాఖ కృషి చేస్తోందని అంటూ మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. సమాజం పట్ల గౌరవంతో ఉండి, ప్రత్యేక గుర్తింపు సాధించాలి అని విద్యార్థులను ప్రోత్సహించారు.మూడు రోజుల పాటు జరిగే ఈ రాష్ట్రస్థాయి క్రీడల్లో విద్యార్థులు అంకితభావంతో పాల్గొనాలని ఆమె సూచించారు. గెలుపోటములు సహజమని, కానీ శ్రద్ధ మాత్రం ఆడే క్రీడపైనే ప్రత్యేకంగా ఉండాలని సూచించారు. కార్యక్రమం లో అడిషనల్ సెక్రటరీ మాదవి దేవి,ఓ ఎస్ డి శ్రీనివాస్,రామారావు,గంగాధర్,స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్య నాయక్,ఆర్ సి ఓ రత్న కుమారి,పాఠశాల ప్రిన్సిపాల్ అజయ్ సింగ్,కల్పన, 23 పాఠశాలల ప్రిన్సిపాల్ లు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story