RTC unions: ఆర్టీసీ సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలి.. సీఎం రేవంత్‌కి ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి

by Ramesh Naini |

తెలంగాణ ఆర్టీసి సంఘాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది.

RTC unions: ఆర్టీసీ సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలి.. సీఎం రేవంత్‌కి ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆర్టీసి సంఘాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (RTC Employees Union) కోరింది. (BRS government) బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో 9 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల గుర్తింపును రద్దు చేసిందని, 2019లో ఆర్టీసీ సంఘాల గుర్తింపును మౌఖిక ఆదేశాలతో రద్దు చేసిందని, దీనిపై ఎన్నో పోరాటాలు చేసినా గత పాలకుల మనసు కరగలేదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ సంఘాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తామని హామీ ఇచ్చిందని కానీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా ఇంకా ఆచరణలోకి రాలేదని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, ఈదురు వెంకన్న కోరారు. ఈ మేరకు సోమవారం వారు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గతంలో రద్దయిన 9 ఉద్యోగ సంఘాలకు తిరిగి గుర్తింపు నిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని... ఆర్టీసీ సంఘాల గుర్తింపును కూడా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసికి ఒక్క పైసా కూడా ఖర్చు లేని, ఆర్థిక భారం అసలే లేని కార్మిక సంఘాలపై ఆంక్షలను వెంటనే ఎత్తివేసి, ఇచ్చిన మాటను నిలుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story