- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ramachandrunaik: ఎమ్మార్వోపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. తహసీల్దార్ ఉద్యోగుల సంఘం ఫైర్
ఎమ్మార్వోపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై తహసీల్దార్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇసుక అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ (Whip Ram Chander Naik) ఎమ్మారోపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (Telangana Tehsildars Association) ఖండించింది. ఇసుక అనుమతలు విషయంలో ప్రస్తుతం అమలులో ఉన్న జీవో నంబర్ 3, జీవో నంబర్ 15 ప్రకారం మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం ఉంది. అంతే తప్ప ప్రత్యేకంగా తహసీల్దార్ లకు ఎటువంటి అనుమతులు ఇచ్చే అధికారం లేదని ఖండించింది. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన ఉద్యోగ సంఘాలు.,. అక్రమ ఇసుక రవాణా అరికట్టడం అన్ని శాఖల సమిష్టి కృషితో మాత్రమే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది లేరని ఉన్న సిబ్బందికి ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకే సమయం సరిపోవడం లేదని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటున్న ఇటువంటి తరుణంలో సభాముఖంగా ప్రభుత్వ విప్ చేసిన వ్యాఖ్యలు రెవెన్యూ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఇటువంటివి భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా గురువారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం విస్సంపెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి రామచంద్రునాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇసుక రవాణా అనుమతులపై స్థానిక తహసీల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇడియట్ లా మాట్లాడకు అని తీవ్ర పదజాలం ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగులు మండిపడుతున్నారు.






