- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బతుకమ్మ పండుగ రోజు సెలవు ఇవ్వండి.. సీఎస్ఉద్యోగుల వినతి
by Gantepaka Srikanth |
తెలంగాణలో ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. గురువారం సచివాలయంలో సీఎస్‌ను కలిసి టీజీఈజేఏసీ చైర్మన్మారం జగదీశ్వర్, కన్వీనర్ ఏలూరి శ్రీనివాస్ రావు వినతి పత్రం సమర్పించారు. ఈనెల 30న ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఇచ్చారని, దానిని పబ్లిక్హాలిడేగా మార్చాలని వారు కోరారు. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించుకుంటారని, ఈ పండుగలో ఉద్యోగులు కూడా పాల్గొంటారని, వారిందరికి అనువుగా సాధారణ సెలవుగా ప్రకటించాని విన్నవించారు.
Next Story






