- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ బంద్‌కు ఉద్యోగుల జేఏసీ మద్దతు
by Gantepaka Srikanth |
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీసీ సంఘాల పిలుపుతో శనివారం చేపట్టే రాష్ట్ర బంద్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీసీ సంఘాల పిలుపుతో శనివారం చేపట్టే రాష్ట్ర బంద్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపింది. శుక్రవారం వివిధ విభాగాలలోని బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డిని, ఇతర జేఏసీ నాయకులను కలిసి బంద్‌కు మద్దతు కోరారు. ఈ మేరకు రేపు జరిగే రాష్ట్ర బంద్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. లచ్చిరెడ్డిని కలిసిన వారిలో స్టేట్ బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, వాటర్ వర్క్స్ డిపార్టుమెంట్ బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు రామరాజువర్మ, మెడికల్ అండ్ హెల్త్ బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వారాల శ్రీనివాస్ తదితరులున్నారు.
Next Story






