- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబ్కారీ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి: ఉద్యోగుల జేఏసీ డిమాండ్
ఇటీవల నిజామాబాద్ డివిజన్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని అకారణంగా దూషించిన ఆ శాఖ కమిషనర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్‌చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల నిజామాబాద్ డివిజన్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని అకారణంగా దూషించిన ఆ శాఖ కమిషనర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్‌చేశారు. శనివారం సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్‌తో కలిసి ఒక ప్రకటనలో పేర్కొంటూ పరుష పదజాలంతో దూషించి, అవమాన పర్చిన ఆబ్కారీ శాఖ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. తన కార్యాలయంలోని ఉద్యోగులను తిట్టి, అవమానించిన ఆయన వ్యవహారంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని సూచించారు.
అన్ పార్లమెంటరీ భాషతో, ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్న ఆయన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. 30 ఏళ్లు ఆబ్కారీ శాఖకు సేవలందించిన ఉత్తమ అధికారి డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డికి ఇలాంటి పరిస్ధితి ఎదురుకావడం దారుణమన్నారు. వారు చేయని తప్పుకు వెధవ , ఇడియట్ అంటూ కమిషనర్ చేసిన దూషణలను సరికావన్నారు. ఆబ్కారీ కమిషనర్ వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.






