- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీపీవోల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తాం: ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి హామీ
గ్రామ పాలన ఆఫీసర్స్ న్యాయమైన సమస్యలను త్వరలోనే పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని టీజీఈ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పాలన ఆఫీసర్స్ న్యాయమైన సమస్యలను త్వరలోనే పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని టీజీఈ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయ ఆవరణంలోని డీసీఏ కార్యాలయంలో గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. జీపీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు అధ్యక్షత వహించారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణలు మాట్లాడుతూ.. జీపీవోల న్యాయమైన సమస్యలను త్వరలోనే పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. సాధ్యమైనంత త్వరలో మీ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినందుకు రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రికార్డ్ అసిస్టెంట్ వేతనాలతో గ్రామ పాలన ఆఫీసర్స్‌గా విధులు నిర్వహిస్తున్న వారికి జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇవ్వాలని, సర్వీస్ రెగ్యులరైజేషన్/ప్రొఫెషన్ డిప్లరైజేషన్ కాని వారికి వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని జీపీవోలు డిమాండ్ చేశారు.
ప్రతి విలేజ్‌లో కార్యాలయం ఏర్పాటు..
జీపీవోలకు లాగిన్ సౌకర్యం కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ప్రతి రెవెన్యూ విలేజ్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలన ఆఫీసర్ ను, గ్రామపాలన సహాయకుడిని నియమించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని, సమగ్ర భూ సర్వే ఆధునికరించాలని చర్చ జరిగింది. తహశీల్దార్ కార్యాలయాలను ఆధునికరించాలని, పెరిగిన జనాభా దామాషా ప్రకారం అన్ని క్యాడర్లలో క్యాడర్ పెంచాలని, విధులు- బాధ్యతలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్వే శిక్షణ జిల్లా కేంద్రాలలో ఇవ్వాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో రెవెన్యూ అకాడమిని ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి అర్జున్ మల్లారం, అసోసియేట్ అధ్యక్షులు కడుమూరు చంద్రయ్య, ముదుం చిరంజీవి, సెక్రటరీ జనరల్ లక్ష్మీనరసింహులు, సెక్రటరీ జనరల్ దాసరి వీరన్న, కొనబోయిన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






