డిప్యూటీ CM భట్టి విక్రమార్కకు ఉద్యోగ JAC కృతజ్ఞతలు

by Gantepaka Srikanth |

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

డిప్యూటీ CM భట్టి విక్రమార్కకు ఉద్యోగ JAC కృతజ్ఞతలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. రోజుల వ్యవధిలోనే DAల GO విడుదల చేయడం, మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రణాళిక శాఖలో కేడర్ స్ట్రెంత్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం, ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ ఇన్సూరెన్స్ పథకం, ప్రమోషన్లకు సంబంధించి వివిధ శాఖల్లో dpc కమిటీలు వేగంగా పనిచేయడంపై ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, JAC వైస్ చైర్మన్ దేవరకొండ సైదులు, నాయకులు చావా రవి, సదానంద గౌడ్, సైదులు, ముజీబ్, కస్తూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.




Next Story