సింగూర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాట్లు.. అధికారులకు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశం

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ మహానగరంలో తాగునీటి కష్టాలు తప్పడంలేదు. క్యూర్ పరిధిలో మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏరియాలో 14లక్షల కనెక్షన్లకుగాను ప్రతి రోజూ 550ఎంజీడీల తాగునీటి సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు చాలా ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో జలమండలి సరఫరా చేస్తున్న నీటిపైనే ఆధారపడుతున్నారు.

సింగూర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాట్లు.. అధికారులకు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో తాగునీటి కష్టాలు తప్పడంలేదు. క్యూర్ పరిధిలో మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏరియాలో 14లక్షల కనెక్షన్లకుగాను ప్రతి రోజూ 550ఎంజీడీల తాగునీటి సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు చాలా ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో జలమండలి సరఫరా చేస్తున్న నీటిపైనే ఆధారపడుతున్నారు. దీంతోపాటు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు గతేడాది ఏప్రిల్, మే మాసాల్లో భారీ వర్షాలు రావడంతో కాస్త ఉపశమనం కల్గింది. కానీ ఈసారి మాత్రం ఇంతవరకు రెండు మూడు వర్షాలు కూడా రాకపోవడంతో నీటికొరత ముంచుకొస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ కొరత తీర్చడానికి సింగూరులో ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు.

రోజుకు 13వేల ట్యాంకర్లు…

క్యూర్ పరిధిలో ముఖ్యంగా అత్యధిక జనాభా, బహుళా అంతస్తుల భవనాలు ఉన్న ఏరియాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్, హైటెక్ సిటీ, ఎస్ఆర్ నగర్, మణికొండ, కూకట్ పల్లి డివిజన్ లలోనే అత్యధికంగా ట్యాంకర్లు బుకింగ్ అవుతున్నాయంటే ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఫలితంగా బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో ట్యాంకర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీంతోపాటు ప్రతిరోజూ 13వేల ట్యాంకర్లు బుకింగ్ చేస్తున్నారు. వీటిని 24గంటల్లో సరఫరా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

సింగూరు ఎమర్జెన్సీ పంపింగ్…

హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగూర్ రిజర్వాయర్ పరిధిలో చేపడుతున్న అత్యవసర పంపింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగూర్ జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 516.080 అడుగులుగా ఉండగా, అందుబాటులో ఉన్న నీటి నిల్వ సామర్థ్యం 5.477 టీఎంసీలుగా ఉంది.జూన్ 1, 2026 నుంచి అత్యవసర పంపింగ్‌ను పాక్షిక స్థాయిలో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. రిజర్వాయర్ 516.00 అడుగుల నీటి మట్టం వద్ద సుమారు 5.340 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో అధికారులు చెబుతున్నారు.

తాగునీటి ఇబ్బందుల్లేకుండా చూడాలి : ఎండీ అశోక్ రెడ్డి

పటాన్‌చెరు ట్రాన్స్మిషన్ డివిజన్ -2 పరిధిలో జరుగుతున్న ఎమర్జెన్సీ పంప్‌సెట్ అలైన్‌మెంట్ పనులను సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, నగరానికి తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర పంపింగ్ వ్యవస్థను సకాలంలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పంప్‌సెట్ అలైన్‌మెంట్, విద్యుత్ సరఫరా, మెకానికల్ లతో పాటు ఎలక్ట్రికల్ అంశాలన్నింటినీ సమన్వయంతో పూర్తి చేసి, అత్యవసర పంపింగ్‌ను నిర్దేశిత గడువులో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి దశలో పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, తలెత్తే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

Next Story